డాక్టర్ సుధాకర్ కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

X
డాక్టర్ సుధాకర్ కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సుధాకర్‌ను బుధవారం కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటూ హైకోర్టు గతంలో ఆదేశించింది. అయితే..అతను మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. అయితే..ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు..డాక్టర్ సుధాకర్ దగ్గరికే వెళ్లి అతని వాంగ్మూలం రికార్డ్ చేయాలని విశాఖ సెషన్స్ జడ్జిని ఆదేశించింది. గురువారం సాయంత్రంలోపు వాంగ్మూలాన్ని హైకోర్టులో సమర్పించాలని సూచించింది. అలాగే హైకోర్టు ఆదేశాలతో డాక్టర్ సుధాకర్ అరెస్ట్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే..ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్, వీడియో క్లిప్పింగులను పిటిషనర్ తరపు న్యాయవాదికి అందించాలని ఆదేశించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
