కరోనా కాలంలో ఎంగేజ్‌మెంట్.. 300 మంది బంధువులను పిలిచి..

కరోనా కాలంలో ఎంగేజ్‌మెంట్.. 300 మంది బంధువులను పిలిచి..
X

జీవితంలో ఒక్కసారి.. కనీసం వంద మందిని పిలిచైనా చేసుకునే పెళ్లిళ్లే కరోనా సీజన్‌లో పది మందితో కానిచ్చేశారు. అలాంటిది ఎంగేజ్‌మెంట్ పేరుతో 300 మంది బంధువుల్ని పిలిచి 15 మందికి కరోన పంచి పెట్టారు. అందులో ఒకరు మృతి చెందారు. గత నెల 11న ధూల్‌పేటకు చెందిన ఓ కుంటుంబం ధూంధాంగా నిశ్చితార్థం నిర్వహించింది. స్నేహితులు, బంధువులు ఈ వేడుకకు హాజరయ్యారు. దీంతో వేడుకలో పాల్గొన్న 15 మందికి వైరస్ సోకింది. పెళ్లి కొడుకు తండ్రి కరోనా బారిన పడి మృతి చెందాడు. లాక్డౌన్‌ని, ప్రభుత్వం మాటలను పెడ చెవిన పెట్టి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిశ్చితార్ధం నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

Tags

Next Story