శ్రామిక్ రైళ్ల విషయంలో కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ విమర్శలు

శ్రామిక్ రైళ్ల విషయంలో కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ విమర్శలు
X

కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ఇప్పటికే సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు శ్రామిక్ రైళ్ల వ్యవహారంలో కేంద్రాన్ని టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ 75 శ్రామిక్ రైళ్లలో దాదాపు లక్ష మంది వలస కూలీలను స్వస్థలాలకు తరలించిందని చెప్పారు . ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకి 6 కోట్ల రూపాయలు చెల్లించిందన్నారు. కూలీల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయలేదని.. మంచినీరు,భోజనానికి కూడా ఎలాంటి ఛార్జీలు తీసుకోలేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం పాత్ర సున్నా అంటూ విమర్శలు చేశారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

Tags

Next Story