ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీని తరలించాలంటూ సీఎంకు లేఖ రాసిన స్థానిక ఎమ్మెల్యే

X
By - TV5 Telugu |20 May 2020 7:43 PM IST
ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల్లో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించాలంటూ స్థానిక ఎమ్మెల్యే గణబాబు సీఎం జగన్‌కు లేఖ రాశారు. తూతూ మంత్రంగా మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారని, బాధిత కుటుంబాలకు సరైన సాయం అందడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. అటు, ఘటన జరిగి 2 వారాలయినా పరిహారం అందలేదంటూ చాలా చోట్ల బాధితులు ఆందోళనలకు దిగుతున్నాయి. తమకు పరిహారం పెంచాలని వెంకటాపురం గ్రామస్తులు పట్టుబడుతుంటే.. మిగతా చోట్ల కూడా ప్రభుత్వం తీరుపై ఇదే స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com