కరోనా వారియర్స్‌కు మహీంద్రా గుడ్‌న్యూస్..

X
By - TV5 Telugu |20 May 2020 2:22 AM IST
కరోనా వారియర్స్, మహిళల కోసం ఆటోమేకర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఆఫర్లను ప్రకటించింది. ఇందులో స్పెషల్ ఆఫర్లు, ఫైనాన్స్ స్కీములు ఉన్నాయి. 8 ఏళ్ల దీర్ఘకాలిక లోన్, పేమెంట్ పై 90 రోజుల మారటోరియం, 100 శాతం ఆన్‌రోడ్ ఫైనాన్స్ వంటివి ఉన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో వినియోగదారులు వాహనాలను సులభంగా కొనుగోలు చేసుకునేలా పథకాలను ప్రారంభించింది. వినియోగదారుల ఆర్థిక స్థోమతను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాలను మహీంద్రా రూపొందించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో విజయ్ నక్రా తెలిపారు. ముఖ్యంగా ఈ పథకం ప్రవేశ పెట్టడానికి ముఖ్య కారకులు కరోనా వారియర్స్. వారు చేస్తున్న అసమాన సేవకు ఉడుతా భక్తిగా ఓ చిన్న సాయం ఇది అని విజయ్ పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com