పొలిటికల్ హీట్ రేపుతున్న నాగబాబు ట్వీట్

పొలిటికల్ హీట్ రేపుతున్న నాగబాబు ట్వీట్
X

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ ట్విట్టర్‌లో వాగ్బాణాలు సంధించే నాగబాబు.. ఈ సారి మహాత్మాగాంధీ హత్యకు కారణమైన నాధురాం గాడ్సేకు అనుకూలంగా ట్వీట్ చేసి కొత్త వివాదానికి ఆజ్యం పోశారు. నాగబాబు చేసిన ట్వీట్‌తో రాజకీయాల్లో హాట్‌ టాపిగ్గా మారింది.

మంగళవారం నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కదా అనేది డిబేటబుల్‌. కానీ అతని వైపు ఆర్గ్యుమెంట్‌ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదన్నారు నాగబాబు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసిందని.. ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతేనని ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు.

గాంధీని చంపితే.. ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా గాడ్సే తను అనుకున్నది చేసాడని.. కానీ నాధురాం దేశభక్తిని శంకించలేమని.. ఆయన ఒక నిజమైన దేశభక్తుడని నాగబాబు సర్టిఫికేట్‌ ఇచ్చేశారు. గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే... మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటూ నాగబాబు ట్వీట్‌ చేయడం పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనంగా మారింది.

Tags

Next Story