హైదరాబాద్‌లో గచ్చిబౌలి నుంచి రాయదుర్గం వెళ్లే వాహనదారులకు గుడ్ న్యూస్

హైదరాబాద్‌లో గచ్చిబౌలి వైపు నుంచి రాయదుర్గం వెళ్లే వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బయోడైవర్సిటీ జంక్షన్‌లోని ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ రెడీ అయింది. దీన్ని మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. 690 మీటర్ల పొడవు, పదకొండున్నర మీటర్ల వెడల్పుతో మూడు లేన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించారు. 30 కోట్ల 26 లక్షలతో నిర్మించిన ఈ వంతెన పైనుంచి వన్ వే ట్రాఫిక్‌ను అనుమతిస్తారు.
ఈ ఫ్లైఓవర్‌తో SRDP ప్యాకేజీ-4 కింద JNTU నుంచి బయోడైవర్సిటీ వరకు చేపట్టిన కారిడార్ పనులు పూర్తయ్యాయి. 379 కోట్లతో చేపట్టిన ఈ కారిడార్ పొడవు 12 కిలోమీటర్లు. ఈ ప్యాకేజీలో భాగంగా ఇప్పటివరకు ఐదు పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మైండ్ స్పేస్ అండర్ పాస్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్ పాస్, రాజీవ్ గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ జంక్షన్ లెవెల్-2 ఫ్లైఓవర్లను గతంలోనే ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com