హైకోర్టు ఆగ్రహానికి గురైన వైసీపీ నేతలు

హైకోర్టు ఆగ్రహానికి గురైన వైసీపీ నేతలు
X

వైసీపీ ఎమ్మెల్యేలు లాక్‌డౌన్‌ ఉల్లంఘించడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ ఉల్లంఘనకు పాల్పడిన ఎమ్మెల్యేలు రోజా, మధుసూదన్‌ రెడ్డి, సంజీవయ్య, వెంకట్‌గౌడ్‌, విడదల రజనిపై.. సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో దాఖలైన పటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి వైసీపీ ఎమ్మెల్యేలే కారణమంటూ న్యాయవాది ఇంద్రనీల్ పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నిరోధక చట్టాలను ప్రజాప్రతినిధులు ఉల్లంఘించారని వాదించారు.

లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజాప్రతినిధులే ఉల్లంఘించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే... ప్రజాప్రతినిధులుగా ఉన్నవారే పాటించకపోవడం ఏమిటని కోర్టుప్రశ్నించింది. ప్రభుత్వం తరపున వివరాలు అందించేందుకు అడ్వకేట్ జనరల్ సమయం కోరారు. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

Tags

Next Story