డిగ్రీ, పీజీ విద్యార్థులను డైరక్ట్‌గా పాస్ చేయండి: మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామ్రాట్ యూజీసీకి లేఖ రాసి కీలక వివరాలు తెలిపారు. డిగ్రీ, పీజీ చివరి ఏడాది చదువుతున్న విధ్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దుని.. వారందరని పాస్ చేయాలని విజ్ణప్తి చేశారు. కరోనా కారణంగా ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం చాలా కష్టతరమైన వ్యవహారమని లేఖలో తెలిపారు. రాష్ట్రంలో 8 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని.. వారందరకీ.. పరీక్షా కేంద్రాలు కేటాయించి.. వారికి కరోనా నుంచి రక్షణ కల్పించడం అంత సులభమైన విషయం కాదని అన్నారు. పరీక్షల పేరుతో విద్యార్థులు ఆరోగ్యాలను, వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టలేమని అన్నారు. దేశంలోనే కరోనా ప్రభావం మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉందని.. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే.. కరోనాకు మరో అవకాశం ఇచ్చినట్టేనని లేఖలో ఆయన చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com