ట్రెయిన్ టైమైంది.. బుకింగ్స్ షురూ..

ట్రెయిన్ టైమైంది.. బుకింగ్స్ షురూ..
X

రోజుకి కొన్ని వేల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేసే రైలు బండి దాదాపు రెండు నెలలుగా ఆగిపోయింది. ఆర్టీసీ బస్సులకు అనుమతులు మంజూరైన పక్షంలో రైలు బండి కూడా పట్టాల మీదకు చేరుకుంటోంది. జూన్ 1 నుంచి తన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ఆ తరువాత నుంచి ప్రతి రోజు 200 రైళ్లను నడపాలని బోర్డు నిర్ణయించింది. అయితే ప్రయాణానికి సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచే ప్రారంభమవడంతో కొద్దిసేపటికే వెయిటింగ్ లిస్ట్‌కు చేరిపోయింది. టికెట్లు పూర్తయిన తరువాత 200వరకు వెయింటింగ్ లిస్ట్ టికెట్లకు అవకాశం కల్పిస్తోంది రైల్వే శాఖ. జూన్ 1 నుంచి 22 వరకు ప్రయాణించేందుకు మాత్రమే ఈ రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతోంది.

జూన్ 1 నుంచి నడిచే రైళ్ల వివరాలు..

ముంబై-హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్

హావ్‌డా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

హైదరాబాద్-న్యూధిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్

దానాపూర్-సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్

విశాఖపట్నం-దిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్

గుంటూర్ -సికింద్రాబాద్ గోల్కొడ ఎక్స్‌ప్రెస్

తిరుపతి-నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్

హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్

దురంతో రైళ్లు: సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (వారానికి రెండు సార్లు)

ప్రత్యేక రైళ్లలో జనరల్ కంపార్ట్‌మెంట్ సీట్లకు కూడా రిజర్వేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సీట్ల రిజర్వేషన్ ఉండే జనరల్ కోచ్‌లకు సెకండ్ క్లాస్ సీటింగ్ టికెట్ ఛార్జి వసూలు చేస్తారు.

టికెట్‌లు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. కౌంటర్లో నేరుగా తీసుకోవడానికి వీలులేదు.

నెల రోజులు ముందుగా కూడా టికెట్ తీసుకోవచ్చు. ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా నిబంధనల ప్రకారం జారీ చేస్తారు.

తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లు ఉండవు.

సికింద్రాబాద్-విజయవాడ మీదుగా..

హావ్‌డా-యశ్వంత్‌పూర్, దురంతో ఎక్స్‌ప్రెస్.. వారానికి ఐదు రోజులు నడుస్తాయి.

ముంబై సీఎస్‌టీ - భువనేశ్వర్ (వయా సికింద్రాబాద్, విజయవాడ) కోణార్క్ ఎక్స్‌ప్రెస్.. ప్రతి రోజూ నడుస్తాయి.

Tags

Next Story