ఏపీలో కామన్‌గా మారిపోయిన లాక్‌డౌన్ ఉల్లంఘనలు

X
By - TV5 Telugu |22 May 2020 4:53 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ ఉల్లంఘనలు కామన్‌గా మారిపోయాయి. చిత్తూరు జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నారు గ్రామ సచివాలయ అధికారులు. గంగాధర నెల్లూరు మండలం వీరక గ్రామంలో లాక్‌డౌన్ రూల్స్‌కు వ్యతిరేకంగా రాత్రి 9 గంటల సమయంలో వేరుశనగ విత్తనాల పంపిణీకి టోకెన్లు జారీ చేశారు. దీంతో గ్రామ సచివాలయం ముందు రైతులు గుంపులుగా గుమిగూడారు. రైతులను భౌతిక దూరం పాటించాల్సిందిగా చెప్పే వారు కూడా లేకుండా పోయారు. రాత్రి 7 తర్వాత ఎవరూ బయటకు రావద్దని కేంద్రం ఆదేశాలున్నా... వాటిని అధికారులే పట్టించుకోకపోవడం ఏంటని విపక్ష నాయకులు మండిపడుతున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com