రంగనాయకమ్మను విచారించిన సీఐడీ అధికారులు

రంగనాయకమ్మను విచారించిన సీఐడీ అధికారులు
X

ఎల్‌.జి. పాలిమర్స్‌ విషయంలో సోషల్ మీడియాలో పోస్టింగ్‌పై రంగనాయకమ్మను సీఐడీ అధికారులు విచారించారు. మహిళా పోలీసుల సమక్షంలో దాదాపు 3 గంటల పాటు రంగనాయకమ్మను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తనతోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసారని.. అతని విచారణ సమయంలోనూ తనను హాజరు కావాలని ఆదేశించారని రంగనాయకమ్మ వెల్లడించారు. గతంలో తాను ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులపైనా ఆరా తీశారని.. పత్రికల్లో, టీవీల్లో వచ్చిన దృశ్యాలను చూసిన తర్వాతే తాను స్పందించానని అధికారులకు చెప్పినట్లు రంగనాయకమ్మ తెలిపారు.

Tags

Next Story