సోనియా గాంధీపై కర్నాటకలో కేసు నమోదు

సోనియా గాంధీపై కర్నాటకలో కేసు నమోదు
X

కాంగ్రెస్ సోనియా గాంధీపై కర్నాటకలో కేసు నమోదైంది. పీఎం కేర్స్ ఫండ్ పై తప్పుడు ప్రచారం చేశారని.. ప్రజలను తప్పుదోవ పట్టించారని బీజేపీ మద్దరుదారు ఒకరు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ మే11 న చేసిన వ్యాఖ్యలు మోదీని కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని కర్నాటక జిల్లాలో శివమొగ్గ జిల్లా సాగర్ కు చెందిన అడ్వకేట్ కేవీ ప్రవీణ్ కుమార్ ఎఫ్ఐఆర్ లో తెలిపారు. పీఎం కేర్స్ కు వచ్చిన విరాళాలు.. ప్రజల సంక్షేమానికి కాకుండా వ్యక్తిగత అవసరాలు వాడుకుంటున్నారని కాంగ్రెస్ తమ అధికార ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసిందని పిటిషనర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రజలు మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని.. అటు, మోదీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని.. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

అటు, ఇదే అంశంపై స్పందించిన కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్.. ఎఫ్ఐఆర్ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని.. ఈ ఎఫ్ఐఆర్ ను ఉపసంహరించుకోవాలని బీఎస్ యడియూరప్పకు లేఖ రాశారు.

Tags

Next Story