హైదరాబాద్‌లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం

హైదరాబాద్‌లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో శుక్రవారం 45 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నారు. మంత్రులు కేటీఆర్‌, ఈటల ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో 22, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 15, రంగారెడ్డి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 3 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయని మేయర్‌ వెల్లడించారు. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story