ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ టాప్

ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ టాప్

కరోనా ప్రభావంలోనూ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ సత్తా చాటింది. ఐటీ ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి సాధించింది. గత ఐదేళ్లుగా దేశంలో ఐటీ ఎగుమతుల్లో ప్రథమస్థానంలో ఉన్న తెలంగాణ.. ప్రతికూల పరిస్థితుల్లోనూ వృద్ధిని నమోదు చేసింది. 2019-20 సంవత్సరానికి గాను 17.93 శాతం వృద్ధి సాధించినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ ఏడాది జాతీయ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.5 శాతంగా ఉందన్నారు.

దేశంలో ఐటీ ఎగుమతులు 11 లక్షలా 12వేలా 492 కోట్లు ఉండగా.. తెలంగాణ ఐటీ ఎగుమతులు లక్షా 28వేలా 807 కోట్లుగా ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 11.6 శాతం ఉందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల కల్పనలో గతేడాది కంటే 7.2 శాతం వృద్ధి సాధించామన్నారు. ఐటీ ఎగుమతుల్లో 17.93శాతం వృద్ధి సాధించిన నేపథ్యంలో ఐటీశాఖను సీఎం కేసీఆర్ అభినందించారు. ఐటీ పరిశ్రమకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్నారు.. ఐటీ వృద్ధి వల్ల తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్‌ గ్రోత్‌ 7.2 శాతం పెరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.. కరోనాను నివారించేందుకు రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు కూడా విశేష కృషి చేశాయన్నారు. 70 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు సమకూర్చారని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఐటీ పరిశ్రమ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Tags

Next Story