నిత్యావసరాల పంపిణీకి వెళ్తున్న ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు

నిత్యావసరాల పంపిణీకి వెళ్తున్న ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు

నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఆసిఫాబాద్ ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమైనా పాకిస్థాన్ నుంచి వచ్చానని అడ్డుకుంటారా అంటూ ఆమె మండిపడింది. అయితే లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ఉన్న కర్ఫ్యూ వల్ల ముందుకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది కోలామ్‌గోంది. అక్కడ 30 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని... ఆదుకోవాలంటూ వారు ఫోన్‌ చేయడంతోనే నిత్యావసర సరులు తీసుకుని వెళ్తున్నానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గ్రామాల్లో నిత్యావసరాలు పంపిణి చేస్తూ రావడం వల్ల కాస్త ఆలస్యమైందన్నారు. కానీ పోలీసులు అడ్డుకుని వెనక్కి వెళ్లాలంటున్నారని... మరి బాధితులను ఎలా ఆదుకోవాలని ఆమె నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story