ఏపీలో ఒక్కరోజే 47 కరోనా పాజిటివ్ కేసులు

X
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో 9 వేల 136 శాంపుల్స్ పరీక్షించగా 47 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా నమోదైన కేసులతో కోయంబేడు లింకులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో పాజిటివ్ వచ్చిన ముగ్గురికి, నెల్లూరు జిల్లాలో మరో ఇద్దరికి కోయంబేడు లింక్ తోనే వైరస్ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల 561కి పెరిగింది. కరోనాతో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో యాక్టీవ్ కేసులు 727 ఉన్నట్లు కరోనాపై విడుదలైన హెల్త్ బులెటిన్ లో అధికారులు ప్రకటించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
