బావిలో 9 మృతదేహాల కేసు.. అక్రమ సంబంధమే కారణమా?

బావిలో 9 మృతదేహాల కేసు.. అక్రమ సంబంధమే కారణమా?

వరంగల్‌ రూరల్ జిల్లాలో వలస కార్మికుల మృతి కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. . అక్రమ సంబంధమే కారణమనే కోణం లో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గీసుకొండ మండలం గొర్రెకుంటలోని గన్నీ సంచుల గోడౌన్‌ వద్ద బావిలో గురువారం 4 డెడ్‌బాడీస్‌ వెలుగుచూడగా.. శుక్రవారం మరో 5 మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. గురువారం రోజున లభించిన మృతదేహాలను.. ఎండీ మక్సూద్‌, ఆయన భార్య నిషా, కుమార్తె బుస్ర, ఆమె మూడేళ్ల కుమారుడిగా గుర్తించారు. ఆ తర్వాతి రోజున లభించిన ఐదు మృతదేహాలు షాబాద్‌, సోహైల్‌, బిహార్‌కు చెందిన కార్మికులు శ్యామ్‌, శ్రీరామ్‌తో పాటు వరంగల్‌కు చెందిన షకీల్‌గా గుర్తించారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన పశ్చిమ బెంగాల్ వాసులుకాగా.. ఇద్దరు బీహార్‌, ఒకరు త్రిపుర వాసిగా గుర్తించారు. మృతదేహాల పోస్ట్‌మార్టమ్‌ పూర్తిగా.. ఫారెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే విష ప్రయోగం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతులు 9 మంది ఫోన్లు ఇంకా లభించలేదు. వీటి మిస్సింగ్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఘటనాస్థలంలో సాక్ష్యాధారులు కూడా పూర్తిస్థాయిలో లభించలేదని సమాచారం. ఆహార పదార్థాలు కూడా... సగం మిగిలి ఉండటంతో విష ప్రయోగం జరిగి ఉంటుందని అనుమానాలు వస్తున్నాయి. ఈ మొత్తం ఘటనకు అక్రమ సంబంధమే కారణమా అన్న కోణంలోనూ పోలీసుల విచారణ కొనసాగుతోంది. అక్రమసంబంధం నేపథ్యంలో.. పరువు హత్యలేమైనా జరిగి ఉంటాయా అనే యాగింల్‌లోనూ.. విచారణ జరుపుతున్నారు పోలీసులు. అనేక ప్రశ్నలు మిగిల్చిన 9 మంది మృతదేహాల ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

MD మక్సూద్‌... 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ నుంచి బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. గత డిసెంబరు నుంచి గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ వల్ల నెలన్నర రోజులుగా గోడౌన్‌లో భార్య, ఇద్దరు కుమారులతో ఉంటున్నాడు. భర్తతో విడిపోయిన అతని కుమార్తె బుస్ర కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరితోపాటు బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాం మరో గదిలో ఉంటున్నారు. ఎప్పట్లాగే యజమాని సంతోష్‌ గోడౌన్‌కు వచ్చే సరికి కూలీలెవరూ కనిపించలేదు. వాళ్ల కోసం ఆయన వెతగ్గా.. చివరికి పాడుబడ్డ బావిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. మిగిలినవారి కోసం గాలించగా అదే బావిలో మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇటీవలే మక్సూద్‌ మనవడి బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బీహార్‌ యువకులకు, స్థానిక యువకుల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. మక్సూద్‌ కూతురు విషయంలోనే ఈ గొడవ జరిగినట్టు చెప్తున్నారు. యాకూబ్ పాషా అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మక్సూద్ కూతురితో అతనికి పరిచయం ఉందని స్థానికులు చెప్తున్నారు. ఓ గదిలో గర్భనిరోధక సాధనాలను క్లూస్‌ టీం గుర్తించింది. వీరిపై విషప్రయోగం జరిగినట్లు భావిస్తున్నారు. బావి వద్ద బట్టలు పిండిన మూటలు లభించాయి. అయితే.. పోస్ట్‌మార్టు రిపోర్టు ఆధారంగా అసలు విషయం తేలుతుందంటున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story