'రామరాజు ఫర్ భీమ్' వీడియో ఎప్పుడు వస్తుందంటే?

రామరాజు ఫర్ భీమ్ వీడియో ఎప్పుడు వస్తుందంటే?

రౌద్రం రణం రుథిరం (ఆర్‌ఆర్‌ఆర్) పేరుతో తారక్, చెర్రీ హీరోలుగా జక్కన్న దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా డి‌వి‌వి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ఆలియా భట్, వోవియా, అజయ్ దేవగన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌ఆర్ఆర్ మూవీని జనవరి 8 2021న రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. అయితే లాక్‌డౌన్ కారణంగా ప్లానింగ్ దెబ్బతింది.

ఆర్‌ఆర్‌ఆర్ లో ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాలు మిగిలే వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడామిగిలే ఉన్నాయి. దీంతో మూవీ కూడా విడుదల వాయిదా కానుందని సమాచారం. ఈ విషయంపై నిర్మాత డి వి వి దానయ్య కూడా క్లారిటీ ఇచ్చారు. ఆర్‌ఆర్ఆర్ మూవీ జనవరి 2021లో వచ్చే అవకాశాలు లేవని ఇప్పటికే కొంతవరకు క్లారిటి వచ్చింది. అయితే ఇప్పుడు అనుకున్నట్టుగా జనవరి 8 న రిలీజ్ చేయలేకపోయినప్పటికి వీలైనంత తొందరలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అందుకే ఇటీవల ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్స్ పునఃప్రారంభం గురించి మాట్లాడినట్లు సమాచారం. తగు జాగ్రత్తలతో షూటింగ్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ విషయంలో ఇప్పుడు భారీ సిబ్బంది.. నటులతో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించలేరు. అందుకే తక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూ పాల్గొనే సన్నివేశాలు తెరకెక్కించే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.

ఇది ఇలా ఉంటే మే 20న తారక్ బర్త్‌డే సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి 'రామరాజు ఫర్ భీమ్' వీడియో వస్తుందని నందమూరి అభిమానులు ఆశించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆ వీడియో మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' మూవీ యూనిట్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. లాక్‌డౌన్ ముగిసి షూటింగ్‌లకు అనుమతులు లభిస్తే ముందుగా 'రామరాజు ఫర్ భీమ్' వీడియోను రిలీజ్ చేయడంపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఫోకస్ చేయనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 15న ఈ వీడియోను రిలీజ్ చేయాడానికి చిత్ర బృందం ప్లాన్ చేయాలనుకుంటున్నారట.

Tags

Read MoreRead Less
Next Story