మోదీపై పోటీ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి పిటిషన్‌పై విచారణ వాయిదా

మోదీపై పోటీ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి పిటిషన్‌పై విచారణ వాయిదా
X

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు ప్రయత్నించిన తేజ్ బహదూర్ కోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బీఎస్ఎఫ్ లో పని చేసిన తేజ్ బహదూర్.. అప్పట్టో జవాన్లకు అందిస్తున్న ఆహారంలో క్వాలిటీ లేదని.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించారు. దీంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం ఆయన వారణాసి నుంచి సమాజ్ వాదీ పార్టీ తరుపున మోదీపై పోటీకి దిగారు. అయితే నామినేషన్ సమయంలో ఆయన సమర్పించిన పత్రాల్లో కొన్ని అంశాలు లేవని.. రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ తిరస్కరించారు. దీన్ని సవాల్ చేస్తూ.. బహదూర్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ కూడా తిరస్కరించడంతో.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై వీడియో కన్ఫరెన్స్ లో విచారణ జరింగింది. అయితే, విచారణ నాలుగు వారాలు వాయిదా వేయాలని బహదూర్ తరపు న్యాయవాది కోరగా.. ఉన్నత న్యాయస్థానం రెండువారాలు మాత్రమే వాయిదా వేసింది.

Tags

Next Story