పది పరీక్షల టైంటేబుల్ వచ్చేసింది..

తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా, కొవిడ్ -19 నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వాయిదా పడ్డ పదోతరగతి పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న న్యాయస్థానం సూచనలను తప్పక అనుసరిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 మధ్య జరుగుతాయని మంత్రి సబిత తెలిపారు.
జూన్ 8 ఇంగ్లీష్ మొదటి పేపర్
జూన్ 11 ఇంగ్లీష్ రెండో పేపర్
జూన్ 14 గణితము మొదటి పేపర్
జూన్ 17 గణితము రెండో పేపర్
జూన్ 20 సైన్స్ (భౌతిక శాస్త్రం)మొదటి పేపర్
జూన్ 23 సైన్స్ (జీవ శాస్త్రం) రెండో పేపర్
జూన్ 26 సోషల్ స్టడీస్ మొదటి పేపర్
జూన్ 29 సోషల్ స్టడీస్ రెండో పేపర్
జులై 2 ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ మొదటి పేపర్ (సంస్కృతం మరియు అరబిక్)
జులై 5 ఒకేషనల్ కోర్సు (థియరీ)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com