చెత్తబుట్టలో పసిపాపను పడేసిన ఓ తల్లి

చెత్తబుట్టలో పసిపాపను పడేసిన ఓ తల్లి

అప్పుడే పుట్టిన పసిపాపను చెత్తబుట్టలో పడేసింది ఓ మహాతల్లి. ఫీవర్ ఆస్పత్రి ఓపీ వార్డులోని డస్ట్ బిన్ లో పాపను పడేసి పారిపోయింది. అయితే..వార్డును క్లీన్ చేస్తున్న సిబ్బంది చెత్త బుట్టలో పాప ఉన్నట్లు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పాపను వైద్య పరీక్షల కోసం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. డస్ట్ బిన్ లో పాపను ఎవరు పడేశారో తెలుసుకునేందుకు ఆస్పత్రిలోని సీసీ ఫూటేజ్ పరిశీలించారు. ఉయదం ఐదున్నర గంటల ప్రాంతంలో బుర్ఖా ధరించిన ఓ మహిళ పాపను వదలివెళ్లినట్లు రికార్డ్ అయ్యింది. ఆమె ఎవరో గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story