వరంగల్ హత్య కేసులో కొనసాగుతున్న మిస్టరీ

వరంగల్ హత్య కేసులో కొనసాగుతున్న మిస్టరీ

వరంగల్ హత్య కేసులో మిస్టరీ కంటిన్యూ అవుతోంది. 9 మంది మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయ్యింది. అయితే.. వాళ్లంతా నీటిలో పడిపోవటం వల్లే చనిపోయినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డాక్టర్లు తేల్చారు. అయితే.. విషప్రయోగంపై ఇంకా ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. కానీ, బావిలో మృతదేహాలు, అక్కడి పరిస్థితులు చూస్తే అది ఖచ్చితంగా హత్యలే ఆయి ఉంటాయని అనుమానిస్తున్నారు. కానీ, ఆ 9 మందిని హత్య చేసి బావిలో పడేశారనేందుకు బలమైన క్లూ ఒక్కటి కూడా ఇప్పటివరకు లభించలేదు. పైగా వారు నీటిలో పడటం వల్లే చనిపోయినట్లు పోస్ట్ మార్టం చెబుతోంది. అయినా..వాళ్లవి ఆత్మహత్యలుగా కనిపిచంటం లేదన్నది పోలీసుల వాదన.

వరంగల్ జిల్లా గొర్రెకుంట శివారులో 9 మంది మృతి మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారింది. కేసులో క్లూ ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ వాళ్లది ఆత్మహత్యే అయితే.. సెల్ ఫోన్ లు ఎందుకు కనిపించటం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా మృతుల సెల్ ఫోన్లన్ని బావి దగ్గరే స్విచాఫ్ అయ్యాయి. కానీ, కుటుంబ పెద్ద మక్సూద్ సెల్ ఫోన్ సంఘటనా స్థలానికి దూరంగా స్విచాఫ్ అయ్యింది. అంటే ఈ ఘటనలో పదో వ్యక్తి ప్రమేయంపై అనుమానాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా.. గోదాంలోని మిద్దెపై ఉండే గదుల్లోనే బీహార్ కూలీలు ఉండేవారు. ఆ మిద్దె వనకాలే బావి ఉంది. దీంతో కుట్ర అంతా బీహార్ కూలీలు ఉండే భవనం దగ్గరే జరిగి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఒక్క క్లూ కూడా దొరక్కుండా మిస్టరీగా మారిన ఈ కేసులో పోలీసులు దర్యాప్తు అంతా సెల్ ఫోన్ కాల్ డేటా చుట్టే తిరుగుతోంది. తొలుత షకీల్, యాకుబ్ కాల్ డేటాపై ఫోకస్ చేసినా.. వాళ్ల తర్వాతే మక్సూద్ ఫోన్ స్విచాఫ్ అవటంతో మక్సూద్ కాల్ డేటాపై దృష్టి సారించారు పోలీసులు. మక్సూద్ తో మాట్లాడినట్లు అనుమానం ఉన్న ఇద్దరు బీహార్ వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అలాగే మక్సూద్ ఇంట్లో సగం తాగిపడేసిన కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి. వాటిలో ఏమైనా కలిపి ఉండొచ్చనే అనుమానంతో ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story