ఎగ్జామ్ ఫ్రం హోమ్.. ఇంట్లో ఉండే పబ్లిక్ పరీక్షలు..

ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అలాగే విద్యార్థులకు ఎగ్జామ్ ఫ్రం హోమ్ నిర్వహించి మంచి ఫలితాలు సాధించవచ్చంటోంది ఐఐటీ భువనేశ్వర్ యూనివర్శిటీ. విద్యార్థులు తరగతి గదిలో ఎంత సౌలభ్యంగా పరీక్షలను రాయగలుగుతారో అదే మాదిరి ఆన్‌లైన్‌లో పరీక్షలను రాసేలా సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివద్ధి చేసింది. ఇందులో వర్చువల్ పరీక్ష గదిని వినియోగిస్తారు. విద్యార్థి ఇంట్లో ఉండి లేదా మరెక్కడైనా కంప్యూటర్ ముందు కూర్చుని పరీక్ష రాయొచ్చు.
తరగతి గదిలో మాదిరిగానే ఇన్విజిలేషన్ ఉంటుంది.. పరీక్ష పత్రం పంపిణీ నిర్వహిస్తారు. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. జవాబు పత్రాలను సబ్‌మిట్ చేశాక అవసరమనుకుంటే ప్రింట్ తీసుకునే వెసులు బాటు కూడా ఉంది. నెట్‌వర్క్ సమస్యలు లేకుండా ఉండడం కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ నెట్‌వర్క్ కనెక్షను వినియోగిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 240 మంది విద్యార్థులకు 31 సబ్జెక్టులపై పరీక్షలు నిర్వహించి ప్రయోగాత్మకంగా సక్సెస్ అయ్యామని ఐఐటీ డైరెక్టర్ ఆర్వీ రాజా కుమార్ తెలిపారు. వీబాక్స్ టెక్నాలజీని ఉపయోగించి అన్ని రకాల పరీక్షలూ నిర్వహించవచ్చని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com