వరంగల్ కేసు.. బతికుండగానే బావిలో..

వరంగల్ కేసు.. బతికుండగానే బావిలో..

సంచలనం సృష్టించిన వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట బావిలో 9 మృతదేహాల కేసు మిస్టరీ వీడింది. మక్సూద్ కుటుంబాన్ని మట్టుబెట్టింది ఇద్దరు బిహారీ యువకులని పోలీసుల దర్యాప్తులో తేలింది. మక్సూద్ అల్లుడి ఆదేశాల మేరకే వారీ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. పుట్టినరోజు పార్టీలో.. కూల్‌డ్రింకులో నిద్ర మాత్రలు కలిపి వారంతా నిద్రలోకి జారుకున్నాక.. వాళ్లను తీసుకెళ్లి బతికుండగానే బావిలో పడేసినట్లు దర్యాప్తులో తేలింది.

దీంతో పోలీసులు మక్సూద్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే 20 మంది బిహారీలను అదుపులోకి తీసుకున్నారు. మృతులందిరి సెల్‌ఫోన్లు గొర్రెకుంట బావి వద్దే గురువారం ఉదయం 5.30 కు స్విచ్ఛాప్ అవ్వగా మక్సూద్ ఫోన్ మాత్రం అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని కట్ర్యాల నందనం గ్రామాల మధ్యలో ఉదయం 8 గంటలకు స్విచ్ఛాఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఓ మహిళతో ఉన్న వివాహ సంబంధమే ఈ హత్యలకు దారితీసిందని పోలీసులు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story