నెటిజన్ వెటకారం.. సోనుసూద్ కూల్ రిప్లై

ఓ మంచి పని చేస్తుంటే ప్రశంసించాల్సింది పోయి వెటకారంతో తన తెలివి తేటల్ని ప్రదర్శించాలనుకున్నాడు ఓ నెటిజన్. దానికి సోనూసూద్ అదిరిపోయే రిప్లై ఇచ్చి మందు మొత్తం దిగిపోయేలా చేశాడు. వలస కార్మికులను తమ స్వస్థలాలకు తరలించేందుకు బాలివుడ్ నటుడు సోనూసూద్ బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే సామాజిక మాధ్యమాల ఎవరు ఏ సాయం కోరివచ్చినా వెంటనే స్పందించి తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. అందరి ప్రశంసలను అందుకుంటున్నారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి.. సోనూ నేను ఇంట్లో ఉన్నాను. నన్ను కాస్త వైన్ షాపు దగ్గరకు తీసుకువెళ్లగలరా అని ట్విట్టర్‌లో అడిగాడు. అందుకు సోనూ అంతే కూల్‌గా.. భయ్యా నేను నిన్ను వైన్ షాప్ నుంచి ఇంటికైతే తీసుకెళ్లగలను.. అవసరమైతే చెప్పు అంటూ నవ్వుతున్న ఎమోజీలు పెట్టి పోస్ట్ చేశాడు. దాంతో నెటిజన్ నోరు మూతపడింది. వీలైతే సాయంలో పాలు పంచుకోవాలి.. లేదంటే నోర్మూసుకోవాలి అంతే కానీ అలా హేళనగా మాట్లాడడం తగదంటూ.. సోనూ నెటిజన్‌కి రిప్లై మంచిగా ఇచ్చారు అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తెరపై విలన్ వేషాలు వేసినా తెర వెనుక మానవత్వం ఉన్న మంచి మనిషి సోనూ.. రియల్ హీరో అనిపించుకుంటున్నారని పలువురు ప్రశంసించారు. ప్రస్తుతం సోనూ, అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'పృధ్వీరాజ్'లో నటిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com