చైనా తయారు చేసిన కొత్త చట్టంతో హాంకాంగ్‌లో చిచ్చు

చైనా తయారు చేసిన కొత్త చట్టంతో హాంకాంగ్‌లో చిచ్చు

హాంకాంగ్‌లో మళ్లీ అగ్గి రాజుకుంది. చైనా తయారు చేసిన జాతీయ భద్రతా చట్టం హాంకాంగ్‌లో చిచ్చు రాజేసింది. చైనాకు వ్యతిరేకంగా హాంకాంగర్లు నిరసనలతో హోరెత్తించారు. రోడ్లపైకి దూసుకువచ్చి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ భద్రతా చట్టం పేరుతో చైనా ప్రభుత్వం తమ స్వేచ్ఛను కాలరాయడానికి ప్రయత్నిస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. ప్రతిపాదిత చట్టాన్ని వ్యతిరే కిస్తూ వేలాదిమంది హాంకాంగ్ పౌరులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. భాష్పవా యు గోళాలను ప్రయోగించారు. వందలమందిని అరెస్టు చేశారు.

హాంకాంగ్‌లో కుట్ర, వేర్పాటు, దేశద్రోహం, విద్రోహాలను నిషేధిస్తూ చైనా ప్రభుత్వం కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని తయారు చేసింది. అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో కూడా ప్రవేశపెట్టిం ది. అక్కడంతా జిన్‌పింగ్‌దే రాజ్యం కాబట్టి రేపో మాపో ఆమోదం కూడా పొందుతుంది. ఐతే, ఈ చట్టం తమ జీవితాలను దారుణంగా దెబ్బతీస్తుందని హాంకాంగర్లు ఆందోళన చెందుతున్నారు. ఆ చట్టం అమలైతే మాట్లాడడమే నేరంగా మారిపోతందని భయపడుతున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిని కఠినంగా శిక్షించే అవకాశాలు పెరిగిపోతాయని, ఫలితంగా తమ స్వేచ్చా స్వాతంత్య్రాలకు ముప్పు వాటిల్లుతుందని టెన్షన్ పడుతున్నారు.

చైనా ప్రభుత్వం మాత్రం కొత్త జాతీయ భద్రతా చట్టంతో హాంకాంగ్ ప్రజలకు వచ్చిన ముప్పేమీ లేదని చెప్పుకొస్తోంది. హాంకాంగ్ నాయకురాలు కేరీ ల్యామ్ కూడా ఇదే మాట చెబుతున్నారు. కానీ హాంకాంగ్ ప్రజలు, వారికి మద్థతిస్తున్న నాయకులు మాత్రం ఆ వాదనతో ఏకీభవించడం లేదు. చైనా వ్యూహాలు తమకు తెలుసని, అందుకే తమ జాగ్రత్తలో తాముంటున్నామని వివరణ ఇచ్చారు. చైనా పెత్తనాన్ని తాము సహించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story