మహారాష్ట్రలో మరో 75 మంది పోలీసులకు కరోనా..

మహారాష్ట్రలో మరో 75 మంది పోలీసులకు కరోనా..
X

మహారాష్ట్రలో మరో 75 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సిబ్బందికి సంబంధించిన పాజిటివ్ కేసులు1,964 కు చేరుకున్నాయి. ఇందులో 849 మంది కోలుకోగా, 1,095 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 2091 పాజిటివ్ కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1792 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 54, 758కి చేరింది. ఇందులో 16,954 మంది కోలుకున్నారు. దాంతో ప్రస్తుతం 35,178 క్రియాశీల కేసులు ఉన్నాయి. 80 శాతం కేసులు రాష్ట్రంలో లక్షణాలు లేకుండా నమోదవుతున్నాయని మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజోయ్ మెహతా అన్నారు.

Tags

Next Story