భోపాల్ లో కొత్తగా 30 కరోనా కేసులు

మంగళవారం, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో కొత్తగా 30 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ కరోనా సోకిన వారి సంఖ్య 1301 కి చేరుకుంది. తాజాగా వివా ఆసుపత్రి నుండి 16 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న రోగుల సంఖ్య 815 కు చేరుకుంది. దాంతో ఇప్పుడు భోపాల్‌లో 486 క్రియాశీలక కేసులు మాత్రమే ఉన్నాయి. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన వారు కరోనా సంక్రమణతో భయపడవద్దని, సామాజిక దూరంతో జీవితాన్ని గడపాలని భోపాలిలకు విజ్ఞప్తి చేశారు. కాగా 60 ఏళ్ల రామ్ గోపాల్ మాల్వియా, తాను ఇప్పుడు బయటకు వెళ్లి కరోనా గురించి అందరికీ తెలిసేలా చేస్తానని చెప్పారు. జహంగీరాబాద్ నివాసి అయిన 72 ఏళ్ల అన్వర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం తనను బాగానే చూసుకుందని అన్నారు. దేనికీ కొరత లేదని.. అతను తన ఇంటిని విడిచిపెట్టిన బెంగ తనకు లేకుండా పోయిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com