ఆన్‌లైన్ ఉద్యమానికి సిద్ధమవుతోన్న కాంగ్రెస్

ఆన్‌లైన్ ఉద్యమానికి సిద్ధమవుతోన్న కాంగ్రెస్

లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, కార్మికులు, చిరు వ్యాపారులను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆన్‌లైన్ ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నెల 28న 50 లక్షలకు పైగా కాంగ్రెస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్నారు. ప్రతి పేద కుటుంబానికి నేరుగా పది వేలు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫేస్‌బుక్‌ లైవ్ ద్వారా రాష్ట్రంలోని నాయకులతో మాట్లాడిన ఆయన.. ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందుల్ని కేంద్రం దృష్టికి రావాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story