కవలలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ

కరోనా పాజిటివ్ మహిళ గాంధీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారు. మేడ్చల్‌కు చెందిన మహిళకు నెలలు నిండడంతో ముందుగా నీలోఫర్‌కు వెళ్లింది. అక్కడ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే గాంధీకి తరలించారు.
మంగళవారం సాయంత్రం ఆమెకు పురుటినొప్పులు మొదలవడంతో వెంటనే సిజేరియన్ చేశారు వైద్యులు. కరోనా ప్రభావం నేపథ్యలో అన్ని జాగ్రత్తలు తీసుకుని డెలివరీ జాగ్రత్తగా పూర్తిచేశారు. ఒక పాప 2.5 కేజీలు, మరో పాప 2 కేజీల బరువుతో పుట్టింది. పుట్టిన శిశువుల రక్త నమూనాలు కూడా వైద్య పరీక్షలకు పంపారు.
తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు వైద్యులు చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికి ఇద్దరు కరోనా పాజిటివ్ మహిళలకు పురుడు పోశారు. తాజా ఘటనలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా క్షేమంగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com