పాక్ లో విజృంభిస్తోన్న కరోనా.. సహకారం అందిస్తామంటూ ముందుకొచ్చిన జపాన్

పాక్ లో విజృంభిస్తోన్న కరోనా.. సహకారం అందిస్తామంటూ ముందుకొచ్చిన జపాన్

పాకిస్తాన్ లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 1,356 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు , 30 మరణాలను నివేదించింది, పాక్ లో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 57,705 కు చేరింది. ఇందులో ఇప్పటివరకు 18,314 మంది రోగులు వైరస్ నుండి కోలుకోగా, ఇప్పటివరకు 1,197 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. మొత్తం 57,705 కేసుల్లో ఇప్పటివరకు 22,934, సింధ్‌లో 20,654, ఖైబర్-పఖ్తుంఖ్వాలో 8,080, బలూచిస్తాన్‌లో 3,468, ఇస్లామాబాద్‌లో 1,728, గిల్గిట్-బాల్టిస్తాన్‌లో 630, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 211 కేసులు కనుగొనబడ్డాయి.

అధికారులు ఇప్పటివరకు 490,908 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు, సోమవారం 7,252 పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలావుంటే కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న జపాన్ పాకిస్థాన్‌కు సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి పాక్ కు ద్వైపాక్షిక సహకారాన్ని అందించాలని జపాన్ నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story