అంతర్జాతీయం

మహిళపై అత్యాచారం.. కోర్టులో చిలుక సాక్ష్యం

మహిళపై అత్యాచారం.. కోర్టులో చిలుక సాక్ష్యం
X

ముగ్గురు వ్యక్తులు మృగాళ్లలా ప్రవర్తించి ఆమెను అత్యాచారం చేసి చంపేశారు. ఇదంతా ఆమె పెంచుకున్న చిలుక చూసింది. ఆమె వారితో పెనుగులాడుతున్నప్పడు చేసిన ఆర్తనాదాలను తన గొంతులో పలికించింది. ఆ ముగ్గురు కామాంధులను కటకటాల వెనక్కు నెట్టించేందుకు సాక్ష్యంగా మారనుంది. అర్జెంటీనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాన్ ఫెర్నాడోకు చెందిన ఎలిజబెత్ టోలెడో అనే మహిళ ఇంటి పై భాగంలో ముగ్గురు వ్యక్తులు అద్దెకు దిగారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు అద్దెకిచ్చిన మహిళపైనే కన్నేశారు.

2018 డిసెంబర్‌లో ఓ రోజు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి అక్కడ ప్లీజ్ నన్ను వదిలేయండి అన్న శబ్దాలతో పాటు.. నన్ను ఎందుకు కొడుతున్నారు అన్న మాటలు వినిపించాయి. మహిళ శవం పక్కనే పంజరంలో చిలుక పలికిన మాటలుగా గుర్తించారు పోలీసులు. అత్యాచారం చేసినప్పు ఆ మహిళ పలికిన మాటల్నే చిలుక ఉచ్చరించిందని పోలీసులు గ్రహించారు.

ఇరుగు పొరుగు వారు కూడా చిలుక మాటలను సాక్ష్యంగా చూపిస్తున్నారు. మరోవైపు పోస్టుమార్టంలోనూ బాధితురాలిని కొట్టి, అత్యాచారం చేసి, గొంతు కోసి చంపినట్లు వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే కేసు విచారణకు రానుంది. చిలుక పలుకులనే కోర్టు సాక్ష్యంగా తీసుకోనుంది.

Next Story

RELATED STORIES