ఆరోగ్య సేతు యాప్‌లో లోపాలు చూపిన వారికి భారీ నజరానా

ఆరోగ్య సేతు యాప్ విషయంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ విషయంలో సమాచారం భద్రతపై పలు అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం అటువంటి సమస్య ఏమీ లేదని ప్రకటిస్తున్నా.. అనేకమంది దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్రం.. ఆ యాప్ వెనుక ఉన్న కోడ్ ను ప్రజలకు బహిర్గతం చేసింది. మే 26 అర్థరాత్రి నుంచి ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇందులో భద్రతా పరమైన లోపాలు ఏమైనా ఉన్నట్టు గుర్తించిన వారికి భారీ నరజానా అందిస్తామని కేంద్రం ప్రకటించింది. దీనిపై నీతి అయాగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. ఇలా కోడ్ బహిర్గతం చేయడం చాలా ప్రత్యేకమైన నిర్ణమని.. ఇలాంటి నిర్ణయం ప్రపంచంలో ఏ దేశం కూడా తీసుకోదని అన్నారు. ఈ యాప్ ను ఇన్టాల్ చేసుకున్న వారికి చుట్టు పక్కలా కరోనా సోకిన వాడు ఉంటే.. వారిని గుర్తించడం ఈ యాప్ ప్రత్యేకత. అయితే, దీనిపై పలు అనుమానాలు తలెత్తడంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ 10 కోట్ల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com