పుట్టినింట విషాదం : ఉపాసన తాతయ్య మృతి..

పుట్టినింట విషాదం : ఉపాసన తాతయ్య మృతి..

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పుట్టినింట విషాదం నెలకొంది. ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఉపాసన ట్విటర్ ద్వారా భావోద్వేగంతో సంతాపం తెలిపారు. తన ట్వీట్ లో ఇలా పేర్కొన్నారు ఉపాసన.. తాత కె.ఉమాపతి రావు గొప్ప విలువలు, నిస్వార్థం, మానవతామూర్తి అని సంబోధించారు.

ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే అని చెప్పిన ఉపాసన.. ఉర్దూలో మంచి రచనలు చేశారని తెలిపారు. కాగా, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని దోమకొండకు చెందిన ఉమాపతిరావు ఐఏఎస్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.. అంతేకాదు టీటీడీ తొలి ఈవోగా పనిచేశారని అన్నారు. తాత ఆత్మకు శాంతి చేకూరాలని ఉపాసన ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story