ఎమ్మెల్యే అనుచరులు వీరంగం.. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఇంటిపై దాడి

అధికార వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. కర్నూలు పాతబస్తీ ఖడక్ పురంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరులు వీరంగం సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి మహబూబ్ అలీఖాన్ ఇంటిపై హఫీజ్ ఖాన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో చొరబడి వస్తువులు పగులగొట్టి బయటపడేశారు. ఈ ఘటనతో కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
మహబూబ్ అలీఖాన్ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే, నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని గతంలోనే ఎమ్మెల్యే అనుచరులు దాడికి ప్రయత్నించారు. చివరికి అతనిపై ఒత్తిడి తెచ్చి కేసులు కాకుండా చూశారని బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ మాట వినడంలేదని అలీఖాన్ ఇంటిపై ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే అనుచరులనుంచి తమకు ప్రాణహాని వుందని.. తమకు రక్షణ కల్పించాలని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలీఖాన్, ఆయన తల్లి వేడుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com