జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ..

జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ..
X

1200 కిలో మీటర్లు తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని సొంతూరికి వెళ్లిన వలస కార్మికురాలు జ్యోతి కుమారి అందరి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ప్రముఖ మ్యాథమెటీషియన్, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్ అందిస్తామని ప్రకటించారు. ఐదు రోజుల పాటు సైకిల్ తొక్కుతూ 1200 కిలోమీటర్లు ప్రయాణించడం పెద్ద సాహసం. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది జ్యోతి. సూపర్ 30 తరపున మా తమ్ముడు జ్యోతి కుటుంబాన్ని కలిసి సహాయం అందించాడు. భవిష్యత్తులో ఆమె ఐఐటీయన్ కావాలనుకుంటే ఉచితంగా కోచింగ్ ఇస్తామని ఆనంద్ కుమార్ ట్వీట్ చేశారు. జ్యోతిని అనేక మంది మంత్రులు సహాయం చేస్తామని అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి సైతం జ్యోతి చదువుకు, వివాహానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు.

Tags

Next Story