ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన బాలకృష్ణ

ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన బాలకృష్ణ

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిచెప్పిన.. దివంగత ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్‌కు పుష్పాంజలి ఘటించారు. ఆ మహనీయుడు తెలుగుజాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా ఆయన ఆయన నివాళులు అర్పించారు. సతీమణితో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన బాలకృష్ణ.. తండ్రి నందమూరి తారక రామారావుకు అంజలి ఘటించారు.

Tags

Read MoreRead Less
Next Story