హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు రాజీనామా

హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ బిందాల్ పై అవినీతి ఆరోపణలు రావడంతో తన పదవికి రాజీనామా చేశారాయన. రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డాకు పంపించారు. నడ్డా వెంటనే తన రాజీనామాను ఆమోదించినట్టు తెలుస్తోంది. ఆరోగ్య శాఖ అధికారి అవినీతి ఆరోపణలపై సరైన దర్యాప్తు జరిపేందుకు తాను రాజినామా చేసినట్టు రాజీవ్ బిందాల్ చెప్పారు. ఇటీవల కోవిడ్ ఎక్కుప్మెంట్ కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి.. ఐదు లక్షల రూపాయల లంచం కేసులో రాజీవ్ బిందాల్ పేరు బయటికి వచ్చింది. హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అజయ్ కుమార్ గుప్తా వేరే వ్యక్తిని డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి..
దాంతో అతన్ని మే 20 న స్టేట్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో అరెస్టు చేసింది, ఆ తరువాత అజయ్ కుమార్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అరెస్టు అయిన డైరెక్టర్ హెల్త్ డాక్టర్ ఎకె గుప్తా డాక్టర్ రాజీవ్ బిందాల్‌తో సన్నిహితంగా ఉన్నారని, 2020 మే 31 న పదవీ విరమణను మూడు నెలల పెంచాలని రాజీవ్ బిందాల్ ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా ఆయన ఫోన్‌ను కూడా నిఘాలో ఉంచారు. ఇదిలావుంటే విజిలెన్స్ బ్యూరో నిర్వహిస్తున్న దర్యాప్తుపై నమ్మకం లేదని ఈ కుంభకోణంపై దర్యాప్తును సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తికి అప్పగించాలని రాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com