రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి మృతి

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి మృతి

రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని దేవిహల్లి సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో 22 ఏళ్ల కన్నడ నటి మెబినా మైఖేల్ మృతిచెందారు. ఓ ట్రాక్టర్‌ ఆమె కారుపైకి దూసుకురావడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికులు గమనించి ఆమెను వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందారు. ప్రమాద సమయంలో ఆమె కర్ణాటకలోని మాడికేరిలోని తన స్వగ్రామానికి వెళుతున్నారు.

రియాలిటీ షో 'ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్'‌ తో మెబినా మంచి గుర్తింపు పొందారు. ఈ సందర్భగా రియాలిటీ షో హోస్ట్ అకుల్ బాలాజీ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.. చిన్నవయసులోనే ఇలా జరగడం బాధాకరం.. వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story