రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామీజీని ఆహ్వానించిన సీఎం

రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామీజీని ఆహ్వానించిన సీఎం

కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి త్రిదండి చినజీయర్ స్వామీజీని ఆహ్వానించారు ముఖ్యమంత్రి కేసీఆర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ జీయర్ ఆశ్రమానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , నిరంజన్ రెడ్డి ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలో గంటపాటు చినజీయర్ స్వామీజీతో సీఎం కేసీఆర్‌ చర్చలు జరిపారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవంతో పాటు యాగానికి రావాల్సిందిగా చినజీయర్ స్వామీజీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌కు చినజీయర్ స్వామీజీ మంగళాశాసనాలు అందజేశారు.

శుక్రవారం ఉదయం 7 గంటలకు కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో ఛండీయాగం, సుదర్శనయాగం, గంగమ్మ పూజలు చేస్తారు. ఛండీయాగం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్‌ను ప్రారంభిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story