కోల్‌కతా : దేశీయ విమాన కార్యకలాపాలు ప్రారంభం

కోల్‌కతా : దేశీయ విమాన కార్యకలాపాలు ప్రారంభం
X

లాక్డౌన్ కారణంగా రెండు నెలల విరామం తర్వాత కోల్‌కతా నుంచి దేశీయ విమాన కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. గురువారం కోల్‌కతా నుంచి 10 విమానాలు బయలుదేరనున్నాయని, ఆలాగే సమాన సంఖ్యలో నగరానికి చేరుకుంటాయని నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. కోల్‌కతా నుంచి మొదటి విమానం ఉదయం 6.05 గంటలకు గుహావటికి బయలుదేరిందని వర్గాలు తెలిపాయి.

మే 25న దేశవ్యాప్తంగా దేశీయ విమాన కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ, అమ్ఫాన్ తుఫాను కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నందున కోల్‌కతాలో విమానాల పునరుద్ధరణ కాలేదు. దీంతో ఇవాళ పునప్రారంభం అయ్యాయి. మరోవైపు ఉత్తర బెంగాల్‌లోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో కూడా దేశీయ విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Tags

Next Story