పాలు మరిగిస్తే ప్లాస్టిక్‌గా మారింది..

పాలు మరిగిస్తే ప్లాస్టిక్‌గా మారింది..

పాలు కల్తీ.. నీళ్లు కల్తీ.. ఆఖరికి ప్రకృతి ప్రసాదించిన గాలి కూడా కల్తీ. అంతా కల్తీ మయం. ఇప్పటి వరకు పాలల్లో చిక్క దనం కోసం పిండి కలిపి కల్తీ చేస్తున్నారని వార్తలు చూశాం. ఇప్పుడు ఏకంగా ప్లాస్టిక్‌తో పాలను తయారు చేసేస్తున్నారు మహానుభావులు మనుషుల్ని చంపడానికి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఓల్డ్ బాన్సువాడకు చెందిన అస్లామ్ పాల కేంద్రం నుంచి లీటర్ పాలు తీసుకువచ్చ వేడి చేశాడు. అవి కాస్తా విరిగిపోయాయి. ఎందుకులే పారబోయడం చక్కెర కలిపి తినొచ్చని మరికాస్త మరగబెట్టాడు.

దాంతో పాలు మరిగి ప్లాస్టిక్ ముద్దలా మారిపోయింది. ఆ ముద్దను ఎంత లాగినా ప్లాస్టిక్ లాగా సాగడం.. తినడానికి ప్రయత్నిస్తే ప్లాస్టిక్ వాసన రావడంతో.. అస్లామ్ బాన్సువాడ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన డీఎస్పీ తాను కూడా అదే కేంద్రం నుంచి పాలు తెప్పించి కాచారు. అవి కూడా ప్లాస్టిక్ ముద్దలా తయారయ్యాయి. దీంతో పాలల్లో రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారని అనుమానం వచ్చింది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసి పాల కేంద్రాన్ని సీజ్ చేస్తామని డీఎస్పీ దామోదర్ తెలిపారు.

Tags

Next Story