సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై కేసు నమోదు

సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై కేసు నమోదు

ప్రముఖ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె నాయుడు పై కేసు నమోదయింది. ఆయనపై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో నటి సాయి సుధ ఫిర్యాదు చేశారు. తనతో సన్నిహితంగా ఉండి.. పెళ్లిచేసుకోమంటే చేసుకోకుండా మోసం చేశాడు అని సాయి సుధ ఆరోపించారు. కాగా సాయి సుధ అర్జున్ రెడ్డి సినిమాలో నటించారు. మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చోటా కె నాయుడుకి సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే.

చోటా కె నాయుడు తమ్ముడే శ్యామ్ కె నాయుడు .. ఆయన కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా అనేక సినిమాలు చేశారు. ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ తోపాటు పలు హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీగా పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story