రైల్వే ఉద్యోగిపై రౌడీషీటర్ దాడి

రైల్వే ఉద్యోగిపై రౌడీషీటర్ దాడి

సికింద్రాబాద్‌ మెట్టుగూడలో మద్యం మత్తులో రౌడీషీటర్‌ హల్‌చల్ చేశాడు. రాకేష్‌ అనే రైల్వే ఉద్యోగిపై రౌడీషీటర్‌ భాగ్యరాజ్‌ దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాకేష్‌ను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సిగరెట్‌ అడిగారనే కారణంతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై కూడా రౌడీషీటర్‌ దాడికిపాల్పడ్డాడు. నిందితుడు డ్రగ్స్‌తో పాటు మద్యం సేవించినట్లు స్థానికులు చెబుతున్నారు. భాగ్యరాజ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story