రష్యాలో కరోనా విజృంభణ.. 8,338 కొత్త కేసులు

రష్యాలో కరోనా విజృంభణ.. 8,338 కొత్త కేసులు

రష్యాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఆ దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3లక్షల 70 వేల మార్క్‌ను దాటింది. గత 24 గంటల్లో 8,338 కొత్త కేసులు నమోదయ్యాయి, 161 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 3,968 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టెస్టింగ్ సామర్ధ్యం మరింత పెంచాలని ఆదేశించారు.

అలాగే దేశంలో సంక్రమణ గరిష్ట స్థాయిని దాటిందని చెప్పిన పుతిన్ ప్రజలు దైర్యంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.. ఇక జూన్లో రెండవ ప్రపంచ యుద్ధం విజయాల కవాతుకు ఆదేశించారు పుతిన్. వాస్తవానికి ఈ కవాతు మే 9 న జరగాల్సి ఉంది, కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. రెండవ ప్రపంచ యుద్ధం విజయానికి 75 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా సైనిక కవాతు నిర్వహించాలని పుతిన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story