అంతర్జాతీయం

జపాన్‌లో తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో కేవలం..

జపాన్‌లో తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో కేవలం..
X

జపాన్‌లో కరోనావైరస్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి.. గత 24 గంటల్లో కేవలం 63 కొత్త కేసులు, 7 మరణాలు సంభవించాయి. గత 15 రోజుల్లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. అయితే కిటాక్యుషు నగరంలో 21 మందికి కొత్తగా కరోనా సోకింది, అయితే గత 23 రోజుల నుండి ఇక్కడ ఒక్క కొత్త కేసు కనుగొనబడలేదు. ఇటువంటి పరిస్థితిలో, ఇక్కడ కొత్త కేసులు నమోదు కావడం చర్చకు దారితీసింది. దేశంలో రెండవ స్టేజ్ సంక్రమణ మొదలైందా అన్న భయం అక్కడి ప్రజల్లో కలుగుతోంది. కాగా జపాన్ లో మొత్తం 16,759

కేసులు నమోదు కాగా.. ఇందులో 14,147 మంది కొలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 882 గా ఉంది. మరోవైపు ప్రపంచంలో ఇప్పటివరకు 59 లక్షల 34 వేల 457 మందికి వ్యాధి సోకింది. ఇందులో 26 లక్షల 02 వేల 279 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 3 లక్షల 62 వేల 712 కు పెరిగింది.

Next Story

RELATED STORIES