కరోనా వ్యాక్సిన్ తయారీకి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం : కేంద్ర మంత్రి

కరోనా వ్యాక్సిన్ తయారీకి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం : కేంద్ర మంత్రి
X

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేసే పని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో జరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు. సమర్థవంతమైన వ్యాక్సిన్ తయారుచేసే ప్రయత్నం ఉంది. ప్రస్తుతం 14 కంపెనీలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. వీటిలో, 4 టీకాలు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. టీకా తయారీకి బయోటెక్నాలజీ విభాగం నుండి నిధులు సమకూర్చినట్టు చెప్పారాయన. అలాగే కరోనా విషయంలో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దేశం మంచి స్థితిలో ఉందన్నారు.

మే 26 నాటికి, భారతదేశంలో లక్ష మందిలో 10.7 మందికి వ్యాధి సోకింది, ప్రపంచంలో లక్ష మందికి సగటున 69.9 కేసులు ఉన్నాయని. లక్ష జనాభాలో మన జనాభాలో కరోనా నుండి మరణించిన వారి సంఖ్య 0.3గా ఉంటే.. ప్రపంచంలోని 4.4 గా ఉందని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 2 లక్ష 49 వేల 636 కోవిడ్ ఆస్పత్రులు, 1 లక్ష 75 వేల 982 కేంద్రాలు ఉన్నాయని.. 60 వేల 848 వెంటిలేటర్లకు ఆర్డర్లు ఇచ్చామని.. ఇవి జూన్ నాటికి వివిధ దశలలో లభిస్తాయని మంత్రి హర్ష్ వర్ధన్ అన్నారు.

Tags

Next Story