'అఆ' సినిమాలో అవకాశం వచ్చింది.. అయినా..: కల్పికా గణేష్

అఆ సినిమాలో అవకాశం వచ్చింది.. అయినా..: కల్పికా గణేష్

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అంత త్వరగా రావు.. కష్టానికి తోడు అదృష్టం కూడా తోడైతేనే ఆ పాత్ర వారిని వెతుక్కుంటూ వెళుతుంది. అందునా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందంటే చెప్పడానికి మాటలు ఉండవు. నటీనటులు ఎగిరి గంతేస్తారు. మరి కల్పికా గణేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయింది.. ఆ విషయాలే చెబుతూ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ రెండు చిత్రాల్లో పాత్ర చిన్నదే అయినా ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు.

ఆ తరువాత వచ్చిన అఆలో నితిన్‌కి సోదరిగా నటించే పాత్ర వచ్చింది. ఆ రోల్ కూడా బాగా నచ్చింది. కానీ అదే సమయంలో నేను వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో అఆ ఆఫర్‌ని వదిలేసుకున్నా. అలాగే మరో చిత్రం కేరాఫ్ కంచరపాలెం చిత్రంలో ముస్లిం అమ్మాయి పాత్ర. అది కూడా వేరే సినిమా చేస్తూ కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేకపోయా. ఆ రెండు సినిమాల్లో నటించలేకపోయినందుకు గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతుంటానని అన్నారు కల్పిక. ఇక నేను ఇప్పటి వరకు నటించిన సినిమాల్లోని హీరోహీరోయిన్లంటే నాకు చాలా అభిమానం. శర్వానంద్, మహేశ్‌బాబు, వెంకటేశ్, అల్లు అర్జున్, సాయిపల్లవి, సమంత మంచి కోస్టార్స్. వాళ్లతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది అని కల్పిక తన సినిమా సంగతులను వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story