చైనాను మించి భారత్‌లో కొవిడ్ మరణాలు ..

హతవిధీ.. కరోనా వైరస్ మనల్ని వదిలిపెట్టేట్టులేదు. అమెరికాని వదిలి మనల్ని పట్టుకుందా అన్నట్టు భారత్‌లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంది కదా అనుకుంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య చైనాను దాటి పోతోంది. ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం, వందల సంఖ్యలో మరణాలు సంభవించడంతో కరోనాని ఎలా కట్టడి చేయాలో ప్రభుత్వానికి అర్ధంకాని పరిస్థితి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7466 కేసులు నమోదైతే, 175 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799కి చేరింది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 4706కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా వైరస్ బయటపడ్డ తరువాత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీన్నిబట్టి కరోన మరణాల్లో భారత్, చైనాను దాటేసిందని స్పష్టమవుతోంది. చైనాలో ఇఫ్పటివరకు 4634 కొవిడ్ మరణాలు సంభవించగా భారత్‌లో ఈ సంఖ్య 4706గా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. ఇక ప్రపంచం మొత్తంలో కరోనా కేసుల విషయంలో భారత్ 9వ స్థానంలో ఉంది. జర్మనీ, టర్కీ 8,9 స్థానాల్లో ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com